Big Bash League 2023 | ఆసీస్ మాజీ కెప్టెన్ కొత్త అవతారం.. అసిస్టెంట్ కోచ్‌గా మెప్పిస్తాడా..?
Big Bash League 2023 : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine) బిగ్‌బాష్ లీగ్(Big Bash League 2023)లో కొత్త అవతారం ఎత్తాడు. అడిలైడ్ స్ట్రయికర్స్(Adelaide Strikers) అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు. 2023 -24వ సీజన్లో పైన్ అడిలైడ్ జట్టుతో కలువనున్నాడు. ఈ విషయాన్ని అడిలైడ్ యాజమాన్యం వెల్లడించింది. పైన్ రాకతో తమ జట్టు....
Big Bash League 2023 : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine) బిగ్‌బాష్ లీగ్(Big Bash League 2023)లో కొత్త అవతారం ఎత్తాడు. అడిలైడ్ స్ట్రయికర్స్(Adelaide Strikers) అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు. 2023 -24వ సీజన్లో పైన్ అడిలైడ్ జట్టుతో కలువనున్నాడు. ఈ విషయాన్ని అడిలైడ్ యాజమాన్యం వెల్లడించింది. పైన్ రాకతో తమ జట్టు బలోపేతం కానుందని అడిలైడ్ స్ట్రయికర్స్ జనరల్ మేనేజర్ టిమ్ నీల్సన్(Tim Nielsen) ఓ ప్రకటనలో వెల్లడించాడు.
‘చురుకైన వికెట్ కీపర్, మంచి టెస్టు బ్యాటర్ అయిన పైన్ మా జట్టుతో కలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. సుదీర్ఘ అనుభవం ఉన్న అతను కోచ్‌గా రావడంతో సంతోషిస్తున్నా. ఈ సీజన్లో అతడు ఎన్నో విధాలుగా మా జట్టుకు ఉపయోగపడనున్నాడు’ అని నీల్సన్ తెలిపాడు. డిసెంబర్ 7 నుంచి బీబీఎల్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్, మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడనున్నాయి.
Oh hello! pic.twitter.com/Hvii23x41D
— KFC Big Bash League (@BBL) August 25, 2023
ఆసీస్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యహరించిన పైన్ ఈమధ్యే ఫస్ట్ క్లాస్ క్రికెట్(First Class Cricket)కు వీడ్కోలు పలికాడు. పైన్‌కు దేశవాళీ క్రికెట్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. తన కెరీర్లో 400 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. బీబీఎల్‌లోనూ ప్లేయర్‌గా పైన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ వికెట్ కీపర్ హోబర్ట్ హరికేన్(Hobart Hurricanes) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1,100 పరుగులు సాధించాడు. మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుకు కూడా పైన్ అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించనున్నాడు.
రిషభ్ పంత్, టిమ్ పైన్

పైన్ 46వ ఆసీస్ టెస్టు సారథిగా 2018లో బాధ్యతలు చేపట్టాడు. అయితే.. ఆట కంటే నోటి దురుసుతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant)పై నోరు పారేసుకున్నాడు. ‘నేను, మా ఆవిడ సినిమాకు వెళ్తాం. నా పిల్లలకు బేబీ సిట్టర్‌గా ఉంటావా?’ అంటూ పంత్‌ను కవ్వించాడు. దానికి పంత్ కూడా ‘నువ్వు ఎప్పుడైనా తాత్కాలిక కెప్టెన్‌ను చూశావా?’ అని పైన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడనుకో.
ఇవి కూడా చదవండి
US Open 2023 | యూఎస్ ఓపెన్‌లో కొత్త టెక్నాలజీ.. ఆటగాళ్ల ప్రవర్తనను గమనిస్తారిలా..!
BCCI – IDFC Bank | బీసీసీఐ మీడియా హక్కులు దక్కించుకున్న ఐడీఎఫ్సీ బ్యాంక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

