చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో గమ్మత్తు ఘటన జరిగింది. దిండిగల్ డ్రాగన్స్, బాల్సీ ట్రిచీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో .. స్పిన్నర్ అశ్విన్(R Ashwin) ఒక్క బంతికే రెండో రివ్యూ కోరారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో అశ్విన్ వేసిన ఓ ఓవర్లో ఓ బంతికి రెండు సార్లు డీఆర్ఎస్ రివ్వ్యూ తీసుకున్నారు. తొలుత బ్యాటర్ రివ్వ్యూ తీసుకోగా, థార్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని బౌలర్ అశ్విన్ తన వైపు నుంచి రివ్వ్యూ కోరాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి.
ట్రిచీ బ్యాటర్ రాజ్‌కుమార్ కు అశ్విన్ బౌలింగ్ చేశాడు. అయితే ఓ భారీ షాట్‌కు రాజ్‌కుమార్ ప్రయత్నించాడు. కానీ బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు అనిపించడంతో అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. అయితే బ్యాటర్ మాత్రం వెంటనే రివ్వ్యూ కోరాడు. బ్యాట్ వద్ద నుంచి బంతి వెళ్తున్న సమయంలో అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ ఉన్నా.. థార్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని మార్చుకోవాలని థార్డ్ అంపైర్ కోరాడు. దీంతో బ్యాటర్ రాజ్‌కుమార్ నాటౌట్ అయ్యాడు.
కానీ బౌలర్ అశ్విన్ మాత్రం ఏమాత్రం సంతృప్తి పడలేదు. తన వైపు నుంచి అశ్విన్ రివ్య్యూ కోరాడు. ఆ డీఆర్ఎస్ను కూడా థార్డ్ అంపైర్ తీక్షణంగా పరీక్షించాడు. బ్యాట్ గ్రౌండ్‌కు తగిలిన సమయంలోనే అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపించినట్లు మరోసారి థార్డ్ అంపైర్ స్పష్టం చేశాడు. బ్యాటర్ రాజ్‌కుమార్‌కు నాటౌట్ ఇవ్వడంతో అశ్విన్ నిరాశతో వెనుదిరిగి వెళ్లాడు. చివరకు అశ్విన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.
Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐
.
.#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9— FanCode (@FanCode) June 14, 2023