విశాఖపట్టణం: దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) .. సెంచరీతో చెలరేగాడు. భారత్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 80 బంతుల్లో అతను 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన డీకాక్ ఆ తర్వాత తన జోరు పెంచాడు. హాఫ్ సెంచరీని 42 బంతుల్లో పూర్తి చేసిన అతను.. తన పవర్ స్ట్రోక్స్‌తో దుమ్మురేపాడు. 94 వద్ద భారీ సిక్సర్ కొట్టి .. వన్డేల్లో చాలా దూకుడుగా మరో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు డికాక్ వన్డేల్లో.. 22 సెంచరీలు చేశాడు. 106 రన్స్ చేసిన డికాక్.. ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
A sublime century! 💯
Quinton de Kock shines in the series decider with a masterful innings. 👏🇿🇦
A perfect blend of power, precision, and skill! 🏏🔥 pic.twitter.com/JsN0lYdAAY
— Proteas Men (@ProteasMenCSA) December 6, 2025
తాజా సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా 32 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసింది. బ్రెవిస్ 12 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బవుమా 48, బ్రెట్జీ 24 రన్స్ చేసి ఔటయ్యారు.