సిడ్నీ: ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu).. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో ఆమె అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17 స్కోరుతో ఓటమిపాలైంది. పీవీ సింధు ప్రస్తుతం 17వ ర్యాంక్‌లో ఉంది. జాంగ్ వరల్డ్ నెంబర్ 12 ర్యాంక్‌లో ఉన్నారు. రౌండ్ 32లో అస్మితా చాలిహపై 21-18, 21-13 స్కోరుతో సింధు గెలిచింది. అంతకుముందు రౌండ్ 16లో ఆకర్షి కశ్యప్‌ను 21-14, 21-10 స్కోరుతో ఆమె ఓడించింది.
Well played champ 🙌
📸: @badmintonphoto #AustraliaOpen2023#Badminton pic.twitter.com/zxOi6wOs8e
— BAI Media (@BAI_Media) August 4, 2023
ఈ సీజన్లో నాలుగోసారి సెమీస్‌లోకి ఎంటర్ కావాలనుకున్న సింధు ఆశలకు జాంగ్ బ్రేక్ వేసింది. కేవలం 39 నిమిషాల్లోనే సింధు తన ఓటమిని అంగీకరించింది. గతంలో జాంగ్‌తో జరిగిన 10 మ్యాచుల్లో ఆరు సార్లు సింధునే గెలిచింది. కానీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో 33 ఏళ్ల చైనా అమెరికన్ ప్లేయర్ చేతిలో పరాభవం తప్పలేదు. ఆగస్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. అయితే ఆ మెగా టోర్నీకి ముందు సింధు ఇలా పేలవ ప్రదర్శన ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
2019లో వరల్డ్ చాంపియన్ అయిన సింధు.. ఇటీవల గాయాల నుంచి కోలుకున్నది. అయితే ఈ ఏడాది జరిగిన 12 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఏడింటిలో ఆమె త్వరగానే నిష్క్రమించింది. 2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన మహమ్మద్ హఫీజ్ హసీమ్ వద్ద ప్రస్తుతం సింధు శిక్షణ తీసుకుంటోంది.