దుబాయ్: అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై అం తర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝళిపిస్తున్నది. ఇప్పటికే జింబాబ్వే మాజీ కెప్టెన్ హిత్ స్ట్రిక్, శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగెపై నిషేధం విధించిన ఐసీసీ.. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెటర్ ఖదీర్ ఖాన్‌పై ఐ దేండ్ల బ్యాన్ వేసింది. జింబాబ్వే (2019) తో సిరీస్ సందర్భంగా ఖదీర్ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో.. ఐసీసీ అతడిపై నిషేధం విధించింది.