బాలి: ఇండోనేషియా మాస్టర్స్ 2021 సెమీఫైనల్లో .. హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు ఓటమి చవిచూసింది. జపనీస్ టాప్ సీడ్ ప్లేయర్ అకేన్ యమగుచి చేతిలో సింధు పరాజయం పాలైంది. 13-21, 9-21 స్కోర్‌తో యమగుచి ఈజీగా సింధును ఓడించింది. కేవలం 32 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తైంది. యమగూచి దూకుడు ముందు సింధు నిలువలేకపోయింది. వాస్తవానికి ఇద్దరి మధ్య గతంలో జరిగిన మ్యాచుల్లో సింధూదే పైచేయిగా ఉన్నా.. ఇవాళ మాత్రం యమగుచి ఆటతీరుకు తలవంచక తప్పలేదు. మూడవ సీడ్ ప్లేయర్ సింధు ఇవాళ ఏ దశలోనూ సరిగా ఆడలేదు. రెండు గేమ్‌ల్లోనూ ఆరంభం నుంచి వెనుకంజలో ఉన్నది.