సింధుకే ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ పగ్గాలు
దిగ్గజ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పది మంది సభ్యులతో కూడిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది.
న్యూఢిల్లీ: దిగ్గజ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పది మంది సభ్యులతో కూడిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యాడు. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, స్విమ్మర్ సాజన్ ప్రకాష్‌ను ఐఓఏ జనరల్ బాడీకి అథ్లెట్స్ కమిషన్ ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నాలుగు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో పోలింగ్ అవసరం లేదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ నూతన కార్యవర్గం 20262030 వరకు నాలుగేండ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగనుంది. నిబంధనల ప్రకారం అథ్లెట్స్ కమిషన్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ డిసెంబర్ 5న ఎన్నికయ్యే ఐఓఏ నూతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులుగా వ్యవహరిస్తారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

