Canada Open 2023 | న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ కెనడా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధుకు వాకొవర్ లభించింది. ప్రత్యర్థి టోర్నీ నుంచి తప్పుకోవడంతో సింధు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శుక్రవారం లక్ష్యసేన్ 21-15, 21-11తో యోగర్ కొలిహో (బ్రెజిల్)ను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న లక్ష్యసేన్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్‌ల్లో విజయం సాధించడం విశేషం. పురుషుల డబుల్స్ ప్రిక్వార్ట్స్లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 9-21, 11-21తో ఇండోనేషియా జంట చేతిలో ఓడి ఇంటి బాటపట్టింది.