Swiss Open | స్విస్ ఓపెన్.. ప్రీ-క్వార్టర్ ఫైనల్లో సింధు, ప్రణయ్
Swiss Open : భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు (PV Sindu), హెచ్ఎస్ ప్రణయ్ (HS Pranay) సత్తా చాటారు. స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. సింధు 21-9 21-16 తో జెంజిరా స్టాడెల్మన్(స్విట్జర్లాండ్)ను చిత్తు చేసింది.
Swiss Open : భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు (PV Sindhu), హెచ్ఎస్ ప్రణయ్ (HS Pranay) సత్తా చాటారు. స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. పోయిన ఏడాది ఈ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచిన సింధు 21-9 21-16 తో జెంజిరా స్టాడెల్మన్(స్విట్జర్లాండ్)ను చిత్తు చేసింది. తర్వాతి రౌండ్లో ఈ ఒలింపిక్ విజేత ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానీతో సింధు తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ 9 ర్యాంకర్ అయిన ప్రణయ్ 21-17 19-21 21-17తో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ఫైనలిస్ట్ షి యు కి(చైనా)పై గెలుపొందాడు. ప్రణయ్ తర్వాతి రౌండ్లోక్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)ను ఢీ కొట్టనున్నాడు. ఈరోజు భారత ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, లీ చెక్ యూ (హాంకాంగ్)తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టీ తైవాన్‌కు చెందిన ఫాంగ్ చిహ్, ఫాంగ్ జెన్ లీ జోడీని ఎదుర్కోనున్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2023 | పంబాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు ఈసీబీ గ్రీన్ సిగ్నల్
ODI Rankings | వన్డేల్లో రెండో ర్యాంకుకు పడిపోయిన టీమిండియా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

