IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో తలపడుతోంది సీఎస్కే. ముల్లనూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ పోరు కోసం తమ జట్టులో ఏ మార్పులు చేయడం లేదని చెప్పాడు అయ్యర్.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, ల్యూకీ ఫెర్గూసన్, చాహల్.
సీఎస్కే తుది జట్టు : రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవింద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), అశ్విన్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరీ, ఖలీల్ అహ్మద్, పథిరన.