IPL 2025 : ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(53) చెలరేగి ఆడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించాడీ యువకెరటం. కేవలం 19 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. దాంతో, పంజాబ్ 6 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. నేహల్ వధేరా 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టాపార్డర్ వైఫల్యంతో జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నారిద్దరు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్‌కు రెండో ఓవర్లోనే షాక్. డేంజరస్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(0)ను ముకేశ్ చౌదరీ బౌల్డ్ చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఖలీల్ అహ్మద్.. సూపర్ బంతితో శ్రేయాస్ అయ్యర్(9)ను బౌల్డ్ చేశాడు. బౌండరీతో జోరుమీదున్న అయ్యర్ బౌల్డ్ కావడంతో 32 కే పంజాబ్ రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్(4)ను ఖలీల్ వెనక్కి పంపి పంజాబ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.