IPL | ధర్మశాల : ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపుతున్నది. గత సీజన్లకు పూర్తి భిన్నంగా ఎదురైన జట్లను చిత్తుచేస్తూ ప్లేఆఫ్స్ రేసులో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా బెంగళూరు(16) తర్వాత పాయింట్ల పట్టికలో పంజాబ్(15) రెండో స్థానంలో కొనసాగుతున్నది. తొలుత పంజాబ్..డాషింగ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(48 బంతుల్లో 91, 6ఫోర్లు, 7సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(45), శశాంక్సింగ్(33 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో 236/5 భారీ స్కోరు చేసింది. లక్నో బౌలర్లను ఉతికి ఆరేస్తూ ప్రభ్‌సిమ్రన్ ఆది నుంచే ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.
హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ధర్మశాలలో దుమ్మురేపుతూ దమ్ము చూపించాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 199/7 స్కోరు చేసింది. ఆయూశ్ బదోని(74) అర్ధసెంచరీతో రాణించగా, సమద్(45) ఆకట్టుకున్నాడు. మిచెల్ మార్ష్(0), పూరన్(6), కెప్టెన్ పంత్(18), మార్క్మ్(్ర13), మిల్లర్(11) ఘోరంగా విఫలమయ్యారు. అర్ష్‌దీప్‌సింగ్(3/16) మూడు వికెట్లతో లక్నో పతనంలో కీలకం కాగా, ఒమర్జాయ్(2/33) రెండు వికెట్లు తీశా డు. ప్రభ్‌సిమ్రన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. పంజాబ్ బౌలర్లు పొదుపు పాటించిన మ్యాచ్‌లో లక్నో బౌలర్లు మయాంక్ యాదవ్ (0/60), అవేశ్‌ఖాన్ (0/57) అడ్డగోలుగా పరుగులు ఇచ్చుకున్నారు.
పంజాబ్‌కు ఆదిలోనే ప్రియాన్ష్ ఆర్య(1) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆకాశ్ మొదటి ఓవర్ ఐదో బంతికి ప్రియాన్ష్..మయాంక్ క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లిస్ వచ్చి రావడంతోనే మయాంక్‌పై విరుచుకుపడ్డాడు. హ్యాట్రిక్ సిక్స్‌లతో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. మయాంక్ వేసిన 4వ ఓవర్లో ఇంగ్లిస్ జతగా ప్రభ్‌సిమ్రన్ రెండు సిక్స్‌లు, ఫోర్ అరుసుకోవడంతో 16 పరుగులు వచ్చి చేరాయి. ఇంగ్లిస్ వెనుదిరిగినా..ప్రభ్‌సిమ్రన్ తన దూకుడు తగ్గించలేదు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ 66/2 స్కోరు చేసింది. ఈ క్రమంలో 30 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్న ప్రభ్‌సిమ్రన్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ఎదురైన ప్రతీ బౌలర్‌ను అలవోకగా ఎదుర్కొంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వీరిని విడదీసేందుకు పంత్ ప్రయోగించిన దిగ్వేశ్ స్పిన్ తంత్రం ఫలించింది. భారీ షాట్ ఆడబోయిన అయ్యర్..దిగ్వేశ్కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..సింగ్ మాత్రం వెనుకంజ వేయలేదు. అవేశ్ వేసిన 18వ ఓవర్లో సింగ్ 4, 6, 4తో అదరగొట్టాడు. ఆ మరుసటి ఓవర్లోనే దిగ్వేశ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ నిష్క్రమించాడు. ఆఖర్లో శశాంక్, స్టొయినిస్ దూకుడుగా ఆడటంతో పంజాబ్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
పంజాబ్: 20 ఓవర్లలో 236/5(ప్రభ్‌సిమ్రన్ 91, అయ్యర్ 45, ఆకాశ్‌సింగ్ 2/30, దిగ్వేశ్ 2/46),
లక్నో: 20 ఓవర్లలో 199/7( బదోని 74, సమద్ 45, అర్ష్‌దీప్ 3/16, ఒమర్జాయ్ 2/33)