IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ పోటీ రోజురోజుకు ఆసక్తిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings).. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు.
కీలకమైన ఈ పోరులో పంజాబ్ మ్యాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్లతో ఆడనుంది. కోల్‌కతా సైతం రెండు మార్పులు చేసింది. మోయిన్ అలీ, రమన్‌దీప్ స్థానంలో విధ్వంసక ఆటగాడు రొవ్‌మెన్ పావెల్, చేతన్ సకారియాలను తీసుకుంది.
🚨 Toss 🚨 @PunjabKingsIPL elected to bat against @KKRiders
Updates ▶️ https://t.co/oVAArAaDRX #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/ccqbIBBKSZ
— IndianPremierLeague (@IPL) April 26, 2025
కోల్‌కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్జాబ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రొవ్మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
ఇంప్యాక్ట్ సబ్స్ : అంగ్క్రిష్ రఘువంశీ, మనీశ్ పాండే, అన్రిచ్ నోర్జి, లవ్‌నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, విజయ్‌కుమార్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రవీణ్ దూబే.
గత మ్యాచ్‌లో కోల్‌కతాను 106 పరుగులకే ఆలౌట్ చేసిన అయ్యర్ బృందంపై మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే.. ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా ఎలాగైనా గెలవాలనే కసితో ఉందిఈ మ్యాచ్‌లో గెలిస్తే 12 పాయింట్లతో పంజాబ్ నాలుగో స్థానానికి దూసుకెళ్లనుంది. ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాకు ఈ మ్యాచ్ కీలకమే. అందుకే.. అజింక్యా రహానే బృందం సొంత ఇలాకాలో పంజా విసరాలని భావిస్తోంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో గత రికార్డులు పరిశీలిస్తే.. కోల్‌కతాదే ఆధిపత్యం. ఇప్పటివరకూ 34 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ 21 పర్యాయాలు గెలుపొందగా.. పంజాబ్ 13 విజయాలకే పరిమితమైంది.