Prithvi Shaw | తానో పెద్ద స్టార్ అనుకుంటున్నడు..! పృథ్వీషాకు శుభమాన్ కోచ్ ఘావ్రీ చురకలు..!
Prithvi Shaw | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాదిలో భారత్ జట్టు తరఫున అద్భుతమైన ఇన్సింగ్స్‌ను ఆడాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్ సాధించడంలో శుభ్‌మాన్ కీలక పాత్ర పోషించాడు.
Prithvi Shaw | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాదిలో భారత్ జట్టు తరఫున అద్భుతమైన ఇన్సింగ్స్‌ను ఆడాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్ సాధించడంలో శుభ్‌మాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక అదే జట్టులో శుభమాన్తో పాటు పృథ్వీషా సైతం టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. పేలవమైన ఫామ్ కారణంగా జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న షా ఈ సారి ఐపీఎల్‌లోనూ దారుణమైన ఫామ్‌తో జట్టుకు భారంగా మారాడు.
ఈ క్రమంలో శుభ్‌మాన్ గిల్ కోచ్, టీమిండియా మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ పృథ్వీషాపై మండిపడ్డాడు. షాను శుభ్‌మన్ గిల్‌తో పోలుస్తూ చురకలంటించాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనే పృథ్వీ షా ఉన్నాడు. ఇవాళ శుబ్‌మన్ ఏ స్థితిలో ఉన్నాడు.. పృథ్వీ షా ఏ స్థానంలో ఉన్నాడని ప్రశ్నించారు. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నారని, నిరంతరం కష్టపడితేనే ఫీల్డ్‌లో నిలదొక్కుకుంటారని ఘవ్రీ పేర్కొన్నారు. ఇద్దరు ఒకే వయస్సుకు చెందిన వారని, కాబట్టి ఇప్పటికీ అయిపోయింది ఏమీ లేదన్నారు.
గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో చాలా లోపాలు ఉండేవని, కష్టపడి గిల్ వాటిని సరిదిద్దుకున్నాడని తెలిపారు. పృథ్వీ షా మాత్రం అలా చేయలేదని, ఇప్పటికీ అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. అతను తను తాను ఎదో పెద్ద స్టార్ క్రికెటర్ అని, తనని ఎవరూ టచ్ చేయలేరని షా అనుకుంటున్నాడని మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్లో, రంజీట్రోఫీలో, ఏ లీగ్‌లోనైనా మనం అవుట్ అయ్యేందుకు ఒక బంతి చాలు అని అతను గ్రహించాలని, జెంటిల్మెన్ గేమ్‌లో రాణించాలంటే నిబద్ధతో పాటు క్రమశిక్షణ ఉండాలని.. అప్పుడు క్రీజులో నిలదొక్కుకొని పరుగులు చేయగలరని పేర్కొన్నారు.
ఇప్పటికైనా పృథ్వీ షా లోపాలను సరిద్దుకోవాలని, కష్టపడి భవిష్యత్‌లో మంచి ఆటగాడిగా ఎదగాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఇదిలా ఉండగా.. పృథ్వీషా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో ఎనిమిది మ్యాచులు ఆడి.. 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉన్నది. మరో వైపు శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్‌ల్లో 851 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, మరో రెండు సెంచరీలు ఉన్నాయి. 26న ముంబయితో జరిగిన కీలక మ్యాచ్‌లో సుడిగాలి ఇన్సింగ్స్ ఆడాడు. కేవలం 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

