కొలంబో: రెండో టెస్టు(IND vs SL)లో శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్‌లో మూడో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. పసిందు సూర్యబంద్ర 65, కెప్టెన్ ధనంజయ డి సిల్వా 4 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక జట్టు ఇంకా 373 రన్స్ వెనుకబడి ఉన్నది. భారత బౌలర్ ప్రసిద్ధి కృష్ణ.. కొలంబో పిచ్‌పై తన పేస్‌ను, బౌన్స్‌ను జనరేట్ చేశాడు. అతని ఖాతాలో ఇప్పటికే మూడు వికెట్లు పడ్డాయి. రెండో రోజు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక .. మూడో రోజు తొలి సెషన్లో ధీటుగా ఆడింది. తొలి సెషన్లో 122 రన్స్ జోడించింది. రిషబ్ పంత్‌కు సబ్‌స్టిట్యూట్‌గా చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఓ దశలో లంక ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ కమిల్ మిషారా 19 రన్స్ చేసి ఇవాళ ఔటయ్యాడు. భోజన విరామ సమయంలో స్వల్పంగా వర్షం వచ్చింది. దీంతో రెండో సెషన్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Lunch on Day 3 in Colombo!
Two wickets in the morning session for #TeamIndia 🙌
Sri Lanka 130/4, trail by 373 more runs
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/zpOsRAZHWK
— BCCI (@BCCI) August 25, 2026