GT vs LSG : సొంత మైదానంలో దుమ్మురేపాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ అనూహ్యంగా తడబడింది. గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ(4-28), నిప్పులు చెరగడంతో లక్నో బ్యాటర్లు చేతులెత్తారు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(30), కెప్టెన్ రిషభ్ పంత్(18), గత మ్యాచ్ హీరో ముకుల్ చౌదరీ(18)లు రాణించడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ మోస్తర్ స్కోర్‌కే పరిమితమైంది. సొంత మైదానంలో చెలరేగిపోవాలనుకున్న లక్నో జట్టుకు గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ(4-28) షాకిచ్చాడు. పవర్ ప్లేలోనే కగిసో రబడ(1-54), ప్రసిధ్ ధాటికి రెండు వికెట్లు కోల్పోయిన లక్నో ఏ దశలోనూ పుంజుకోలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన గుజరాత్ పేసర్లు లక్నో హిట్టర్లకు బ్యాట్ ఝులిపించే అవకాశమివ్వలేదు.
TWIN STRIKES ⚡️⚡️
🎥 Prasidh Krishna rocking #LSG back in his first two overs 👊
Updates ▶️ https://t.co/kIuuJYbiNx#TATAIPL | #KhelBindaas | #LSGvGT | @gujarat_titans pic.twitter.com/xAWjLkCg5b
— IndianPremierLeague (@IPL) April 12, 2026
ప్రసిధ్ ధాటికి 69కే మూడు వికెట్లు పడిన వేళ పవర్ హిట్టర్ ఆయుశ్ బదొని(9), నికోలస్ పూరన్(19)లు లక్నోను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ఇద్దరి సైతం వెనక్కి పంపిన ప్రసిధ్ స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు. కుర్రాళ్లు అబ్దుల్ సమద్(18), ముకుల్ చౌదరీ(18) మెరవగా.. ఆఖర్లో ఇంప్యాక్ట్ సబ్ జార్జ్ లిండే(16)ధనాధన్ ఆడడంతో ఆ జట్టు 160 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో షమీ(12 నాటౌట్) సిక్సర్ బాదడంతో లక్నో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేయగలిగింది.