న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించాడు. బీడబ్ల్యూఎఫ్ మంగళవారం ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ప్రణయ్ వ్యక్తిగత టైటిల్స్ నెగ్గకపోయినా.. థామస్‌కప్‌లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు 7 టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు, రెండింట్లో సెమీస్‌కు చేరాడు. స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. యువ షట్లర్ లక్ష్యసేన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసినప్పటి నుంచి కోర్టుకు దూరమైన స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఒక ర్యాంక్ కోల్పోయి ఏడో స్థానంలో ఉంది.