Prakash Poddar : భారత క్రికెట్లో ఎంఎస్.ధోని ఎంత గొప్ప అటగాడో తెలిసిందే. అతని కెప్టెన్సీలో టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు గెలిచింది. ఈ జార్ణండ్ డైనమైట్ను భారత జట్టుకు అందించింది ఎవరో తెలుసా..? ప్రకాశ్ పొద్దార్. బీసీసీఐ పెద్దలకు ధోనీ పేరును సూచించిన ఈయన హైదరాబాద్‌లో డిసెంబర్ 29వ తేదీన మరణించారు. బెంగాల్ మాజీ క్రికెటర్ అయిన పొద్దార్ అతని స్నేహితుడు రాజు ముఖర్జీ అప్పట్లో బీసీసీఐ టాలెంట్ రిసోర్స్ డెవలప్మెంట్ వింగ్(టీఆర్‌డబ్ల్యూ) హెడ్‌గా ఉన్న దిలీప్ వెంగ్ సర్కార్‌కు ధోనీ పేరును సిఫారసు చేశారు.
బీసీసీఐ టాలెంట్ స్కౌట్ అయిన పొద్దార్ ధోనిలోని ప్రతిభను ముందుగా గుర్తించాడు. ఆ విషయాన్ని వెంటనే బీసీసీఐకి తెలియజేశాడు. దాంతో, భారత్‌కు గొప్ప కెప్టెన్ దొరికాడు. అందరూ ముద్దుగా లులూ దాగా పిలిచే పొద్దార్ 1960ల్లో భారత టెస్టు జట్టుకు ఆడాడు. స్వదేశంలో 1962లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కి ఎంపికయ్యాడు. ప్రకాశ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11 సెంచరీలు చేశాడు.