హైదరాబాద్, ఆట ప్రతినిధి: రష్యాలో జరుగుతున్న ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన పెరుమాళ్ల ప్రదీప్‌కుమార్ సత్తాచాటాడు. పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్(డబ్ల్యూఫ్) నిర్వహిస్తున్న పోటీల్లో మూడు విభాగాల్లో ప్రదీప్ మొదటి స్థానాల్లో నిలిచి పతకాలు కైవసం చేసుకున్నాడు. 62-64 ఏండ్ల వయసు విభాగంలో బరిలోకి దిగిన ప్రదీప్..డెడ్‌లిఫ్ట్‌లో 160కిలోలు, ఓవరాల్‌గా 390 కిలోల బరువెత్తి రెండు పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. రష్యాలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ తరఫున నలుగురు లిఫ్టర్లు పోటీపడ్డారు.