కొచ్చి : కేరళలో జరుగుతున్న నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్-2025లో భాగంగా పోల్‌వాల్ట్ క్రీడలో సరికొత్త జాతీయ రికార్డు నమోదైంది. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన దేవ్‌కుమార్ మీనా.. 5.35 మీటర్లు ఎత్తుకు దూకాడు. తద్వారా గతంలో తన పేరిటే ఉన్న (5.32 మీటర్ల) రికార్డును బ్రేక్ చేసి స్వర్ణం సాధించాడు. ఈ పోటీలలో తమిళనాడు అథ్లెట్లు గౌతమ్ (5.15 మీటర్లు), రీగన్ (5.10 మీటర్లు) వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు.