హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్) అన్ని హంగులతో రాబోతున్నది. ఐదో ఎడిషన్‌కు ముందు హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌లో ప్లేయర్ల వేలంను శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈనెల 25 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు జరిగే టోర్నీలో పోటీపడుతున్న 16 జట్లు మొత్తం 192 మంది గోల్ఫర్లను ఎంపిక చేసుకున్నాయి.
పూర్తి పారదర్శక రీతిలో ప్రొఫెషనల్‌గా నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఆయా ఫ్రాంచైజీ యజమానులు, కెప్టెన్లు, స్పాన్సర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి విద్యాసంస్థల గ్రూపు చైర్మన్ మహే, హెచ్జీఏ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు, పలువురు ప్లేయర్లు హాజరయ్యారు. ఈనెల 19న ఐదో సీజన్ అధికారిక కార్యక్రమంలో ట్రోఫీ, టీమ్ జెర్సీలను ఆవిష్కరిస్తామని టీపీజీఎల్ కమిషనర్ సంజయ్ పేర్కొన్నారు.