PKL 10 | స్టార్ రైడర్‌కు గాయం.. ఫిబ్రవరిలో మోకాలి సర్జరీ
PKL 10 : ప్రో కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ(Dabang Delhi)కి పెద్ద షాక్. ఆ జట్టు కెప్టెన్, స్టార్ రైడర్ నవీన్ కుమార్(Naveen Kumar) అనూహ్యంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. పదో సీజన్లో మోకాలికి గాయంతో బాధపడిన నవీన్...
PKL 10 : ప్రో కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ(Dabang Delhi)కి పెద్ద షాక్. ఆ జట్టు కెప్టెన్, స్టార్ రైడర్ నవీన్ కుమార్(Naveen Kumar) అనూహ్యంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. పదో సీజన్లో మోకాలికి గాయంతో బాధపడిన నవీన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. పిబ్రవరిలో ఈ స్టార్ రైడర్ కుడి మోకాలికి సర్జరీ(Knee Surgery) చేయించుకోనున్నాడు.
అతడు కోలుకునేందుకు దాదాపు ఆరు నెలలు పట్టనుంది. దూకుడుకు మారుపేరైన నవీన్ ఎక్స్‌ప్రెస్ పీకేఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వేగంగా 1,000 పాయింట్లు సాధించిన తొలి రైడర్‌గా చరిత్ర సృష్టించాడు.
Pesh karte hai U Mumba ke khilaaf Captain Ashu ki zabar𝗗𝗨𝗦t performance 😉#DabangDelhi #HarDumDabang pic.twitter.com/UTJC3HJVSJ
— Dabang Delhi KC (@DabangDelhiKC) January 11, 2024
‘నవీన్ గొప్ప నాయకుడు. గత కొన్ని సీజన్లలో దబాంగ్ ఢిల్లీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు గాయపడడం మా జట్టుకు పెద్ద షాక్. ఈ కష్ట సమయంలో మేముంతా అతడి వెన్నంటే ఉంటాం. సర్జరీ అనంతరం రిహాబిలిటేషన్‌లో నవీన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని దబాంగ్ ఢిల్లీ సీఈఓ దుర్గానాథ్ వాగ్లే తెలిపాడు.
జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్‌లో గాయపడిన నవీన్

పదో సీజన్ ఆరంభంలో దుమ్మురేపిన నవీన్.. డిసెంబర్ 27న జైపూర్ పింక్ ఫాంథర్స్తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడిన అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. స్కానింగ్ పరీక్షల అనంతరం అతడి మోకాలిలో లిగమెంట్ దెబ్బతిన్నట్టు వైద్యులు గుర్తించారు. దాంతో, అతడు ఫిబ్రవరిలో మోకాలి సర్జరీ చేయించుకోనున్నాడు. నవీన్ వైదొలగడంతో ఢిల్లీ మేనేజ్మెంట్ అషూ మాలిక్(Ashu Malik)ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Houthi Rebels: 60 హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా అటాక్
- Guntur kaaram Talk | మహేశ్‌బాబు గుంటూరు కారంతో ఘాటెక్కించాడా..?
- Mohammad Siraj | పెండ్లి వేడుకలో ఖవ్వాలీ కచేరీ.. మస్త్ ఎంజాయ్ చేసిన సిరాజ్.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

