హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో వ్యాయామ విద్యకు మరింత ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం(పెటా టీఎస్) డిమాండ్ చేసింది. 2025-27 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆదినారాయణ, అధ్యక్షుడిగా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కృష్ణమూర్తిగౌడ్, కార్యవర్గ అధ్యక్షుడిగా నాగరాజు, కోశాధికారిగా శక్రు నాయక్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెటా టీఎస్ పలు కీలక తీర్మానాలు చేసింది. ‘రాష్ట్ర సంఘం గుర్తించిన 1803 కొత్త ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. క్రీడల ప్రాధాన్యత, వ్యాయామ విద్య ఉపాధ్యయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 400 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి. పీఈటీలకు పీఏటీ పరీక్ష నిర్వహించాలి.