పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (6) అవుటవడంతో ఆ జట్టు దెబ్బతిన్నట్లే కనిపించింది. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ (22 నాటౌట్), దీపక్ హుడా (2 నాటౌట్) ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో జట్టు ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.