RCB vs DC : ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బ్యాటర్లు చితక్కొట్టారు. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికేస్తూ ఆర్సీబీ రజత్ పాటిదార్(52) అర్ధ సెంచరీతో చెలరేగగా.. డేంజరస్ విల్ జాక్స్(41) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, ఆర్సీబీ ప్రత్యర్థి ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/31), రసిక్ సలాం(2/23)లు రాణించారు.
టాస్ ఓడిన ఆర్సీబీకి ఓపెనింగ్ జోడీ శుభారంభం ఇవ్వలేదు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(6) ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద ఫ్రేజర్‌కు చిక్కాడు. దాంతో, 23 పరుగుల వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది.
Gun partnership! 🔥
Put us in a strong position and has set the stage perfectly for a BIG finish 🤞#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvDC pic.twitter.com/6Jya2UfZRJ
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 12, 2024
ఆ తర్వాత విరాట్ కోహ్లీ(27) బౌండరీలతో భయపెట్టినా.. ఇషాంత్‌తో మాటల యుద్దానికి దిగి వికెట్ పారేసుకున్నాడు. 36కే స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. కాస్త కుదురుకున్నాక అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
Axar Patel with a brilliant catch 👌#DC dismiss both set batters 🙌 #RCB reach 138/4 after 15 overs
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/xVOBrOThxd
— IndianPremierLeague (@IPL) May 12, 2024
ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న పాటిదార్ ఐదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విల్ జాక్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 88 రన్స్ జోడించి ఆర్సీబీని పటిష్ట స్థితిలో నిలిపాడు. వీళ్లిద్దరి విధ్వంసం చూశాక ఆర్సీబీ అలవోకగా 200 ప్లస్ కొట్టడం ఖాయం అనిపించింది. అయితే.. రసిక్ దార్ ఓవర్లో పాటిదార్ వెనుదిరగగా.. ఖలీల్ అహ్మద్ ఒకే ఓవర్లో మహిపాల్ లొమ్రోర్, దినేవ్ కార్తిక్(0)లను ఔట్ చేశాడు. ఓవైపు వచ్చిన వాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు క్యూ కడుతున్నా కామెరూన్ గ్రీన్(30 నాటౌట్) చివరిదాకా నిలబడి బెంగళూరుకు భారీ స్కోర్ అందించాడు.