IND vs SL | అర్ధ శతకాలతో మెరిసిన పసిందు, దినుష.. ఫాలోఆన్ అంచున శ్రీలంక..!
IND vs SL : కొలంబో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు భారత్ ఆధిపత్యం చెలాయించగా.. మూడో రోజు శ్రీలంక గొప్పగా పోరాడింది. పసిందు సూర్యబండార(80), సోమాల్ దినుష(85 నాటౌట్)లు అర్ధశతకాలతో ఆతిథ్య జట్టు ఫాలో ఆన్ అంచున నిలిచింది.
IND vs SL : కొలంబో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు భారత్ ఆధిపత్యం చెలాయించగా.. మూడో రోజు శ్రీలంక గొప్పగా పోరాడింది. పసిందు సూర్యబండార(80), సోమాల్ దినుష(85 నాటౌట్)లు అర్ధశతకాలతో ఆదుకున్నా.. ఆతిథ్య జట్టు ఫాలో ఆన్ అంచున నిలిచింది. ప్రసిధ్ కృష్ణ(3-47), మానవ్ సుతార్(3-83)ల విజృంభణతో కష్టాల్లో పడిన లంకకు దినుష ఆపద్భాందవుడయ్యాడు. అతడి అసమాన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చుట్టేయాలనుకున్న టీమిండియా బౌలర్ల ప్రయత్నాలు ఫలించలేదు.
తొలి రెండో రోజులు కొలంబో టెస్టులో పట్టుబిగించిన భారతజట్టుకు మూడో రోజు ప్రతిఘటన ఎదురైంది. సిరీస్‌ను సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. తొలి సెషన్లోనే ప్రసిధ్ కృష్ణ(3-47) రెండు వికెట్లతో లంకను దెబ్బకొట్టినా పసిందు సూర్యబండార(80) ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో టెస్టుల్లో మొదటి అర్ధ శతకం సాధించాడు. అయితే.. లంచ్ తర్వాత భారత బౌలర్లు టకటకా మూడు వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
100 & 84 in Galle and now a fifty in Colombo!
Sonal Dinusha is on a roll! 🔥
Follow #SLvsIND, 2nd Test, Day 3, live: https://t.co/bcjKB0jJQn pic.twitter.com/Wm2UVMr53W
— Cricinfo (@cricinfo) August 25, 2026
క్రీజులోకుదురుకున్న పసింద్ను జడేజా బౌల్డ్ చేసి బ్రేకివ్వగా.. సిరాజ్, మానవ్ చెరొక వికెట్ తీయగా కాసేపట్లోనే లంక ఆలౌటవ్వడం ఖాయమనిపించింది. కానీ, అడ్డుగోడలా నిలిచిన సోనాల్ దినుష(85 నాటౌట్) వికెట్ కాచుకుంటూనే కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. టీమిండియా పేసర్లు, స్పిన్నర్లను సమర్దంగా ఎదుర్కొన్న అతడు.. నువాంత(18), ఆపై లహిరు కుమార(8 నాటౌట్)తో కలిసి టీమిండియాను విసిగించాడు. ఆఖరి సెషన్లో వర్షం అంతరాయం, వెలుతురు లేమితో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో.. ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి లంక 265 పరుగులు చేసింది. మరో 39 రన్స్ చేస్తే ఫాలో ఆన్ తప్పించుకోనుంది లంక. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన శుభ్‌మన్ గిల్ సేన ఇంకా 238 రన్స్ ఆధిక్యంలో ఉంది.
Stumps!
Rain brings an end to Day 3 in Colombo 🌧️
Sri Lanka 265/8 in the first innings, trail by 238 runs
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/cc3dtY64ek
— BCCI (@BCCI) August 25, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

