ఒలింపిక్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న సర్ఫింగ్ పోటీలలో భాగంగా బ్రెజిల్‌కు చెందిన గాబ్రియేల్ మదీనా విన్యాసమిది.
పారిస్‌కు సుమారు 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తహిటి దీవులలో జరుగుతున్న ఈ పోటీల మూడో రోజు ఆటలో గాబ్రియెల్.. 9.90 స్కోర్ చేసి ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన సర్ఫర్‌గా రికార్డులకెక్కాడు. ఈ ఫొటోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘పిక్చర్ ఆఫ్ ది ఒలింపిక్స్’ అని కామెంట్ చేస్తున్నారు.