Paris Olympics 2024 : భారత షూటర్ (Indian Shooter) రమితా జిందాల్ (Ramita Jindal) పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) శుభారంభం చేసింది. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో నిరాశపర్చిన జిందాల్.. ఇవాళ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్ ఈవెంట్లో సత్తా చాటింది. క్వాలిఫైయర్స్‌లో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
క్వాలిఫైయర్స్‌లో రమితా జిందాల్ 631.5 పాయింట్ల స్కోర్ చేసి ఐదో స్థానంలో నిలిచింది. అయితే మరో భారత్ షూటర్ ఎలావెనిల్ వేలారివన్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. క్వాలిఫైయర్ రౌండ్ ఆసాంతం రమితా జిందాల్ కంటే ముందంజలో ఉన్న ఎలావెనిల్ ఆఖరి షాట్స్‌లో తడబడి ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. శనివారం అర్జున్ బబుతా కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో తలపడ్డ రమితా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలను తృటిలో కోల్పోయింది.