న్యూఢిల్లీ: పారా స్పోర్ట్స్‌కు దేశంలో ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నది. ఇటీవల పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెట్లు అంచనాలకు మించి రాణించిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం లేహ్(లడఖ్)లో పారా స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు కాబోతున్నది. లాస్‌ఏంజిల్(2028) పారాలింపిక్స్ కోసం ఇక్కడ అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ అందించనున్నారు. లెహ్‌లోని లడఖ్ అటామనాస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎల్ఏహెచ్డీసీ).. హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్(ఏఎమ్ఎఫ్) మంగళవారం ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ కేంద్రంలో భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన పారా అథ్లెట్లు శిక్షణ పొందనున్నారు. ఇందులో పారా ఆర్చరీ, అథ్లెటిక్స్, వింటర్ గేమ్స్ సహా మొత్తం 20 క్రీడల్లో శిక్షణకే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఏహెచ్డీసీ సీఈసీ గైయాల్సన్, ఏఎమ్ఎఫ్ ప్రతినిధి ఆదిత్య పాల్గొన్నారు.