అట్టహాసంగా పారా ఆసియాడ్ ఆరంభం
ఐదో ఎడిషన్ పారా ఆసియా క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆదివారం జరిగిన ఆరంభ వేడుకల్లో భారత క్రీడాకారులు దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటారు.
- ప్రారంభ వేడుకల్లో ్ర పత్యేక ఆకర్షణగా భారత బృందం
నగోయా (జపాన్): ఐదో ఎడిషన్ పారా ఆసియా క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆదివారం జరిగిన ఆరంభ వేడుకల్లో భారత క్రీడాకారులు దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటారు. 5 వేల ఏండ్ల నాటి మానవ నాగరికత వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక బ్లేజర్లను ధరించి మార్చ్ఫాస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పారా షట్లర్ ప్రమోద్ భగత్, పారా స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ త్రివర్ణ పతాకాలను చేతబూని జట్టును ముందుండి నడిపించారు. భారత పారా అథ్లెట్లు ధరించిన అధికారిక బ్లేజర్లపై సింధు నాగరికత ముద్రలు, ప్రాచీన లిపి నమూనాలు ముద్రించారు.
అలాగే కాలర్ భాగంలో సప్తసింధు నదుల ప్రాంతాన్ని స్మరిస్తూ డిజైన్ చేయగా, జేబుపై త్రివర్ణ పతాకాన్ని అలంకరించారు. ఈ క్రీడల్లో భారత్ తరఫున 11 విభాగాల్లో మొత్తం 168 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఈనెల 24 వరకు జరిగే ఈ మెగా గేమ్స్‌లో 45 దేశాల నుంచి సుమారు 3వేల మంది పారా అథ్లెట్లు పోటీ పడుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

