న్యూఢిల్లీ : పారా ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ టోక్యోలో జరిగిన హులిక్ దైహత్సు అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నీలో ఎస్ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. భగత్ ఫైనల్లో స్వదేశానికే చెందిన మనోజ్ సర్కార్ను 21-16, 21-19తో ఓడించాడు.
కాగా పురుషుల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్ఎల్4 విభాగంలో నేహల్ గుప్త-నవీన్ శివకుమార్, మహిళల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 విభాగంలో తులసిమతి మురుగేశన్-మానసి జోషి స్వర్ణాలు సాధించగా, తులసిమతి మురుగేశన్ మహిళల ఎస్యు5 విభాగంలో రజతం, సుకాంత్ కదమ్, తరుణ్, మనీషా జోషి, హార్దిక్ మక్కర్-రుతిక్ రఘుపతి ఆయా విభాగాలలో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.