SRH vs LSG | ఉప్పల్‌లో పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన లక్నో..!
SRH vs LSG : సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగలింది. అదిరే ఆటతో రెండో విజయంతో మురవాలనుకున్న హైదరాబాద్‌కు లక్నో సూపర్ జెయింట్స్ బిగ్ షాకిచ్చింది.
SRH vs LSG : సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగలింది. అదిరే ఆటతో రెండో విజయంతో మురవాలనుకున్న హైదరాబాద్‌కు లక్నో సూపర్ జెయింట్స్ బిగ్ షాకిచ్చింది. 157 పరుగుల స్వల్ప ఛేదనలో ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(45) దంచేయగా.. రిషభ్ పంత్ (68 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో 9 రన్స్ అవసరమవ్వగా.. మూడు ఫోర్లు బాదిన పంత్ పంతొమ్మిదో సీజన్లో లక్నోను బోణీ కొట్టించాడు.
ఐపీఎల్లో ఆతిథ్య జట్టుకు మరో హార్ట్ బ్రేక్. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మిడిలార్డర్ మెరుపులతో 156 రన్స్ కొట్టిన హైదరాబాద్.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో చేతులెత్తేసింది. హర్ష్ దూబే వేసిన తొలి ఓవర్లో రెండే రన్స్ రావడంతో నితీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు ఓపెనర్లు. ఎడెన్ మర్క్రమ్(45) వరుసగా రెండు ఫోర్లు బాదగా.. మిచెల్ మార్ష్ ఓ బౌండరీ సాధించాడు. ధాటిగా ఆడుతున్న మార్ష్‌ను షాన్ మలింగ బోల్తా కొట్టించగా 37 వద్ద లక్నో తొలి వికెట్ పడింది. ఉనాద్కాట్ ఓవర్లో మర్క్రమ్ ఫోర్, సిక్సర్ సాధించగా పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.
Gritty, composed, and leading by example 👏
2️⃣0️⃣th #TATAIPL fifty for the #LSG skipper Rishabh Pant!
The visitors need 13 from last 12 balls
Who is winning this? 🤔Updates ▶️ https://t.co/qC2rF1Hiiz#KhelBindaas | #SRHvLSG pic.twitter.com/7OEeyHLpMy
— IndianPremierLeague (@IPL) April 5, 2026
ధాటిగా ఆడుతూ అర్ధ శతకానికి చేరువైన మర్క్రమ్ను కుశాంగ ఔట్ చేయగా.. ఇంప్యాక్ట్ సబ్ ఆయుష్ బదొని(12)ని హర్ష్ దూబే తెలివిగా బోల్తా కొట్టించాడు. కాసేపటికే నికోలస్ పూరన్(1) వెనుదిరిగినా రిషభ్ పంత్(68 నాటౌట్), అబ్దుల్ సమద్(16)లు పట్టుదలగా ఆడారు. ఉనాద్కాట్ ఓవర్లో పంత్, మలంగ ఓవర్లో సద్ రెండు బౌండరీలతో లక్నోను గెలుపు దిశగా నడిపారు. 27 బంతుల్లో 34 రన్స్ జోడించిన ఈ ద్యయాన్ని దూబే విడదీయగా లక్నో ఐదో వికెట్ పడింది. 12 బంతుల్లో పరుగులు అవసరమవ్వగా.. హర్షల్ పటేల్ నాలుగే రన్స్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో పంత్ తొలి బంతికే ఫోర్ బాదాడు. రెంబో బంతి బౌండరీ దాటడంతో లక్నో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దంచేసిన నితీశ్, క్లాసెన్
సొంత మైదానంలో దంచికొడతారనుకున్న టాపార్డర్ కుప్పకూలింది. రెండొందలకు పైగా స్కోర్‌తో ప్రత్యర్థిని భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. పవర్ ప్లేలో మహమ్మద్ షమీ(2-9) పడగొట్టాడు. పవర్ ప్లేలో నిప్పులు చెరిగిన షమీ డేంజరస్ ఓపెనర్లను ఔట్ చేయగా.. 24కే నాలుగు వికెట్లు పడిన దశలో హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ రెడ్డి(55)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.

కాస్త కుదురుకున్నాక ఫోర్లు, సిక్సర్లతో లక్నో బౌలర్లను బెంబేలిచ్చిన ఈ ద్వయం ఐదో వికెట్‌కు విలువైన 100 పరుగుల భాగస్వామ్యంతో ఆరెంజ్ ఆర్మీని ఆదుకుంది. అయితే.. డెత్ ఓవర్లలో లక్నో బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్ 156 పరుగులకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

