Asia Cup 2023 | ఫాస్టెస్ట్ సెంచరీ క్లబ్లో పాక్ బ్యాటర్.. మిగతా ముగ్గురు ఎవరంటే..?
Asia Cup 2023 : ఆసియా కప్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్(Iftikhar Ahmed) అరుదైన ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో వేగవంతమైన శతకం(Fastest Century) బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈరోజు జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ నేపాల్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కేవలం 67 బంతుల్లోనే ఇఫ్తికార్ వందకు చేరువయ్యాడు. దాంతో, భారత మాజీ ఆల్‌రౌండర్....
Asia Cup 2023 : ఆసియా కప్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్(Iftikhar Ahmed) అరుదైన ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో వేగవంతమైన శతకం(Fastest Century) బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈరోజు జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ నేపాల్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కేవలం 67 బంతుల్లోనే ఇఫ్తికార్ వందకు చేరువయ్యాడు. దాంతో, భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా(Suresh Raina) తర్వాతి స్థానంలో నిలిచాడు. 2008లో పసికూన హాంకాంగ్‌పై రైనా 66 బంతుల్లో శతకం బాదాడు.
ఈ టోర్నీలో వేగవంతమైన సెంచరీ రికార్డు పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహీద్ ఆఫ్రీదీ(Shahid Afridi) పేరిట ఉంది. విధ్వంసక బ్యాటర్ అయిన ఆఫ్రీది 2010లో బంగ్లాదేశ్‌పై 53 బంతుల్లోనే వంద కొట్టాడు. ఇది అతడి కెరీర్‌లోని గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోయింది. శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య(Sanath Jayasuriya) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మాజీ లెఫ్ట్ హ్యాండర్ 2008లో బంగ్లాదేశ్‌పై 55 బంతుల్లో సెంచరీ సాధించాడు.
సురేశ్ రైనా, సనత్ జయసూర్య

ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ తీసుకుంది. నేపాల్ బౌలర్లను ఉతికారేసిన ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్: 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ బాబర్ ఆజం(151 : 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి 214 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి
Durand Cup 2023 | రెచ్చిపోయిన ఈస్ట్ బెంగాల్ ఫ్యాన్స్.. ప్రత్యర్థి మద్దతుదారులపై ఇటుకలతో దాడి
Asia cup 2023 | పసికూనపై సెంచరీతో విరుచుకుపడిన పాక్ బ్యాటర్లు.. నేపాల్ ముందు కొండంత లక్ష్యం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

