Haris Rouf | ఇంటివాడైన పాకిస్థాన్ బౌలర్.. మోడల్‌ను పెళ్లాడిన హ్యారిస్ రౌఫ్
కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటైంది
Haris Rouf : పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రౌఫ్ శనివారం ఓ ఇంటివాడయ్యాడు. ముజ్నా మసూద్ మాలిక్ అనే పాక్ మోడల్‌ను అతను టర్కీ రాజధాని ఇస్థాంబుల్లో పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో హ్యారిస్, ముజ్నాల వివాహ వేడుక జరిగింది. వీళ్ల పెళ్లికి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రీది, పాక్ మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత సెలక్టర్ షాహద్ ఆఫ్రీది హాజరయ్యారు. హ్యారిస్, ముజ్నా ఇద్దరూ క్లాస్మేట్స్. ఈమధ్యే ముజ్నా, హ్యారిస్ వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దాంతో, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపించాయి. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో తమ బంధాన్ని మరోమెట్టు ఎక్కించారు. వీళ్ల పెళ్లి ఫొటోలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ కొత్త జంటను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పాక్ క్రికెటర్లు, ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ముజ్నా ఈమధ్యే ఇస్థాంబుల్లో డిగ్రీ పూర్తి చేసింది.
29 ఏళ్ల హ్యారిస్ ఇదే నెలలో టెస్టు క్రికెట్లో ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకూ అతను 57 టీ 20లు, 15 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. టీ 20 వరల్డ్ కప్ డెత్ ఓవర్లలో హ్యారిస్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ ఫైనల్ చేరడంతో అతని పాత్ర ఉంది. ఫైనల్లో అతను 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంతకుముందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హ్యారిస్ వేసిన 18 ఓవర్లో చివరి రెండు బంతుల్లో కళ్లు చెదిరే సిక్సర్లు బాది జట్టుని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
Haris Rauf at his Nikkah ceremony 🙌#PakistanCricket pic.twitter.com/S5HwDOFPIh
— Cricket Pakistan (@cricketpakcompk) December 24, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

