ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ(Asif Ali).. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 33 ఏళ్ల ఆ క్రికెటర్ పాకిస్థాన్ తరపున 58 టీ20 మ్యాచ్‌లు, 21 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 959 రన్స్ చేశాడు. దీంట్లో మూడు సెంచరీలు ఉన్నాయి. చివరి సారి అతను 2023 ఆసియా గేమ్స్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2022, 2021 పాక్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతను ఆడాడు. పాకిస్థాన్ జెర్సీ ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని, దేశం తరపున ఆడడం గర్వంగా ఫీలవుతున్నట్లు తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
2018 ఏప్రిల్‌లో వెస్టిండీస్ తో జరిగిన టీ20లో అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది పాక్ లీగ్ క్రికెట్లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు టైటిల్ గెలుచుకున్నది. ఫైనల్లో చేజింగ్ చేస్తూ ఓ దశలో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అతన్న వన్డే జట్టులోకి తీసుకున్నారు. దేశవాలీతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లీగ్ క్రికెట్లో ఆడనున్నట్లు అసిఫ్ అలీ పేర్కొన్నాడు.