షార్జా: వరుస బౌండరీలతో స్కాట్లాండ్కు ముచ్చెమటలు పట్టించిన మొహమ్మద్ హఫీజ్ (19 బంతుల్లో 31) అవుటయ్యాడు. షరీఫ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో హఫీజ్ విరుచుకుపడ్డాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీగా వెనుతిరిగాడు.
పాక్ రివ్యూ కోరినా ఫలితం మాత్రం మారలేదు. తర్వాతి ఓవర్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనితోపాటు క్రీజులో వెటరన్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ ఉన్నాడు.