PAK vs BAN: బంగ్లా అదే తడబాటు.. పాక్ ముందు ఈజీ టార్గెట్
PAK vs BAN: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది.
PAK vs BAN: ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు ఎదురవుతున్నా బంగ్లాదేశ్ ఆటతీరు మారడం లేదు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా (70 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ కాగా లిటన్ దాస్ (45), కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (43)లు ఫర్వాలేదనిపించారు. పాక్ పేసర్లలో అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే వరుస షాకులు తాకాయి. తొలి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్ తాంజిద్ హసన్ పరుగులేమీ చేయకుండానే షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఔటవడంతో బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. అఫ్రిది అదే ఊపులో తన తర్వాత ఓవర్లో నజ్ముల్ శాంతో (4)ను పెవిలియన్‌కు పంపాడు. హరీస్ రౌఫ్ ఆరో ఓవర్లో ఆఖరి బంతికి ముష్పీకర్ రహీమ్ (5)ను ఔట్ చేశాడు. 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మహ్మదుల్లా, లిటన్ దాస్‌లు ఆదుకున్నారు. ఈ ఇరువురూ నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. ఈ జోడీని ఇఫ్తికార్ విడదీసి బంగ్లాను కుదురుకోనీయకుండా చేశాడు.
లిటన్ దాస్ నిష్క్రమణ తర్వాత వచ్చిన కెప్టెన్ షకిబ్ అల్ హసన్‌తో కలిసి మహ్మదుల్లా ఐదో వికెట్‌కు 28 పరుగులు జతచేశాడు. అయితే అర్థ సెంచరీ తర్వాత మహ్మదుల్లాను షహీన్ అఫ్రిది బౌల్డ్ చేయడంతో బంగ్లా కష్టాలు రెట్టింపయ్యాయి. తౌహిద్ హృదయ్ (7) కూడా విఫలమయ్యాడు. ఆఖర్లో మెహిది హసన్ మిరాజ్ (30 బంతుల్లో 25, 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులతో బంగ్లా 200 మార్కు దాటింది. షకిబ్ – మెహిది హసన్‌లు ఏడో వికెట్‌కు 48 బంతుల్లో 45 పరుగులు జోడించారు.
పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నా 2025లో జరుగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో క్వాలిఫై కావాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తర్వాత ఆడబోయే రెండింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-8లో చేరాల్సి ఉంటుంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్తాన్‌తో పాటు ప్రస్తుత ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్ -7 జట్లు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇటీవలే ఓ ప్రకటన వెల్లడించిన విషయం తెలిసిందే. మరి బంగ్లా బ్యాటర్లు విఫలమైన చోట బౌలర్లు అయినా ఆ జట్టు కలను నెరవేరుస్తారేమో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

