Mohammad Yousuf : పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్(Mohammad Yousuf) కీలక బాధ్యతలు చేపట్టాడు. ఈ వెటరన్ క్రికెటర్ జూనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు. వచ్చే ఏడాది అండర్ -19 ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో యూసుఫ్ ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అంతేకాదు మాజీ పేసర్ సొహైల్ తన్వీర్(Sohail Tanvir)ను జూనియర్ జట్టు సెలెక్షన్ కమిటీ హెడ్‌గా అపాయింట్ చేసింది. రెండు రోజుల క్రితమే మాజీ స్పీడ్‌స్టర్ వాహబ్ రియాజ్.. నేషనల్ చీఫ్ సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. క్రికెటర్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న యూసుఫ్ గతంలో పాక్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.
పాక్ క్రికెటర్లలో టాప్ బ్యాటర్ అయిన యూసుఫ్ 12 ఏండ్ల కెరీర్లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టెస్టుల్లో 7,530, వన్డేల్లో 9,720 పరుగులు సాధించాడు. అంతేకాదు 2016లో ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక రన్స్ బాదిన ఆటగాడిగా యూసుఫ్ రికార్డు నెలకొల్పాడు.
బాబర్ ఆజాం
వన్డే వరల్డ్ కప్ వైఫల్యంతో పాక్ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. జట్టు ఎంపికలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో తొలుత చీఫ్ సెలెక్టర్ ఇంజమామూల్ హక్ రాజీనామా చేయగా.. స్వదేశం వెళ్లాక బాబర్ ఆజాం సారథ్యానికి గుడ్ బై చెప్పేశాడు. దాంతో తాత్కాలిక కెప్టెన్లుగా షాన్ మసూద్, షాహీన్ ఆఫ్రిదిను పీసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే.