Shoaib Akhtar | పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసుపత్రిలో చేరాడు. గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఆసుపత్రిలో చేరి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ సందర్భంగా మాజీ ఫాస్ట్ బౌలర్ ఉద్వేగానికి గురయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. గతకొంతకాలంగా మోకాలి గాయం బాధపెడుతుందని, దీని కారణంగా తన కెరీర్ చాలా త్వరగా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. లేకుంటే మరో నాలుగైదేళ్లు తాను క్రికెట్‌ను ఆడి ఉండేవాడనని పేర్కొన్నాడు. అలా చేస్తే తాను వీల్‌చైర్‌కే పరిమితమవుతానని తనకు తెలుసునని.. అందుకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
షోయబ్‌కు గత పదేళ్లుగా మోకాళ్ల సమస్య ఉండగా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ అనంతరం షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో షోయబ్ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. తన మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైందని మాజీ పేసర్ తెలిపాడు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన షోయబ్ అకర్త్ 2000 సంవత్సరాల్లో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా పేరు సాధించాడు. నిప్పులు చేరిగే బంతులతో బ్యాట్స్మెన్లను వణికించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా బంతిని విసిరిన బౌలర్‌గా రికార్డు షోయబ్ పేరిటనే ఉన్నది. అక్తర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 14 టీ20లు, 163 వన్డేలు, 46 టెస్టులు ఆడాడు. టీ20ల్లో 21 వికెట్లు, వన్డేల్లో 247, టెస్టుల్లో 178 వికెట్లు పడగొట్టాడు.