Duleep Trophy | తిలక్ అజేయ అర్ధశతకం.. ఫైనల్లో ఎదురీదుతున్న సౌత్..!
Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ పట్టుబిగించగా.. సౌత్ జోన్ ఎదురీదుతోంది. చిదంబరం స్టేడియంలో ఈస్ట్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు తేలిపోగా దేవ్‌దత్ పడిక్కల్(62) అర్ధ శతకంతో మెరిశాడు.
Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ పట్టుబిగించగా.. సౌత్ జోన్ ఎదురీదుతోంది. చిదంబరం స్టేడియంలో ఈస్ట్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు తేలిపోగా దేవ్‌దత్ పడిక్కల్(62) అర్ధ శతకంతో మెరిశాడు. మహమ్మద్ షమీ(2-17), ముకేశ్ కుమార్(2-36)లు ఆరంభంలోనే దెబ్బకొట్టినా.. పడిక్కల్, కెప్టెన్ తిలక్ వర్మ(56 నాటౌట్) నిలబడడంతో ఈస్ట్ కాస్త కోలుకుంది. మూడో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన సౌత్ 466 పరుగులు వెనకబడి ఉంది.
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తడబడుతోంది. చిదంబరం స్టేడియంలో ఇషాన్ కిషన్(270) రికార్డు డబుల్ సెంచరీతో భారీ స్కోరందించగా.. ఈస్ట్ బౌలర్లు ముకేశ్ కుమార్(2-36), మహమ్మద్ షమీ(2-17)లు ఆదిలోనే సౌత్‌ను తీసి దెబ్బతీశారు. మూడో రోజు తొలి సెషన్లోనే రికీ భుయి(1)ని ముకేశ్ పెవిలియన్ పంపగా.. మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్(32)ను శిఖర్ మోహన్ ఔట్ చేశాడు. అంతే.. 70 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. ఓపెనర్లు విఫలమైనా దేవదత్ పడిక్కల్ (62) అర్ధ శతకంతో మెరిశాడు.
తిలక్ నిలబడ్డాడు..
శ్రీలంక పర్యటనలో సెంచరీలతో చెలరేగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్కోర్ బోర్డును నడిపించాడు. అయితే.. అతడిని ముకేశ్ వెనక్కి పంపి రెండో వికెట్ సాధించాడు. ఆపై షేక్ రషీద్(27), స్మరణ్ రవిచంద్రన్(23)లను షమీ బోల్తా కొట్టించాడు. అంతే.. 174కే ఈస్ట్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ తిలక్ వర్మ(56 నాటౌట్), శ్రేయాస్ గోపాల్(26)లు కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
Knockout games. Captain’s knocks. 🔥
Tilak Varma stood tall when it mattered most💯
📸- JioStar/X pic.twitter.com/GJ3m8vF9fA
— CricTracker (@Cricketracker) September 8, 2026
టీ సెషన్లో నింపాదిగా ఆడిన వీరు ఆరో వికెట్‌కు 70కి పైగా రన్స్ జోడించారు. అయితే.. గోపాల్‌ను ఖరేషి ఔట్ చేసి సౌత్‌కు షాకిచ్చాడు. అయినా సరే తిలక్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడాడు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి సౌత్ ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 466 పరుగులు వెనకబడి ఉంది. మరొక్క రోజే ఆట మిగిలి ఉండడంతో ఈస్ట్ జోన్ టైటిల్‌ను ముద్దాడడం లాంఛనమే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

