హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టీటీ టోర్నీలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఓయూ 3-1 తేడాతో ఎమ్జీ యూనివర్సిటీపై విజయం సాధించింది. సింగిల్స్‌లో కేశవన్ 5-11, 4-11, 5-11తో అమిర్ చేతిలో ఓడగా, అలీ 12-10, 11-8, 11-5తో ఆదిత్యపై, వరుణ్శంకర్ 12-10, 9-11, 11-5, 11-3తో జైక్పై గెలిచాడు. రివర్స్ సింగిల్స్‌లో అలీ 11-8, 11-9, 11-4తో అమిర్‌పై విజయం సాధించాడు.