హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్స్ 2025లో ఉస్మానియా యూనివర్సిటీ టెన్నిస్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. జైపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో ఉస్మానియా.. 3-0తో సావిత్రిభాయి ఫూలె యూనివర్సిటీని ఓడించింది.
సింగిల్స్ విభాగాల్లో శ్రీమన్య రెడ్డి, సమ చెవిక రెడ్డి ఏకపక్ష విజయాలు సాధించగా డబుల్స్‌లో సౌమ్య, చెవిక ద్వయం కూడా అదరగొట్టడంతో ఉస్మానియా సెమీస్ బెర్తును దక్కించుకుంది.