హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ప్లేయర్లు సత్తాచాటుతూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన టెన్నిస్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సౌమ్య(ఓయూ) 6-4, 6-2 జాస్మిన్ రావత్(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ)పై అద్భుత విజయం సాధించింది.
ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సౌమ్య వరుస సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో సింగిల్స్ సెమీస్‌లో చెవిక 4-6, 6-4, 5-7తో లక్ష్మిగౌడ చేతిలో ఓటమిపాలైంది. అయితే మహిళల డబుల్స్ సెమీస్‌లో ఓయూ జోడీ సౌమ్య, చెవిక 3-6, 6-3, 10-6తో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ద్వయం జాస్మిన్, సుహాని గౌర్‌పై గెలిచింది.