వింబుల్డన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో తలపడేది ఎవరో ఖరారైంది. గురువారం జరిగిన వేర్వేరు సెమీస్ మ్యాచ్‌ల్లో ఒన్స్ జాబర్, ఎలీనా రబాకినా ఫైనల్ పోరులోకి దూసుకెళ్లారు. తొలుత జరిగిన సెమీస్‌లో జాబర్ 6-2, 3-6, 6-1తో మారియాపై అద్భుత విజయం సాధించింది.
గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా ప్లేయర్‌గా జాబర్ కొత్త రికార్డు నెలకొల్పింది. మూడోసీడ్‌గా బరిలోకి దిగిన ఈ ట్యునీషియా అమ్మాయి..తన స్నేహితురాలు మారియాతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడింది. మరో సెమీస్‌లో రబాకినా 6-3, 6-3తో సిమోనా హలెప్‌పై అలవోక విజయం సాధించింది. టైటిల్ పోరులో నిలువాలనుకున్న హలెప్ ఆశలపై నీళ్లు చల్లుతూ జాబర్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
వింబుల్డన్ టోర్నీ నుంచి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ నిష్క్రమించాడు. గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో శుక్రవారం జరిగే సెమీస్‌లో ప్రత్యర్థి నిక్ కిర్గియోస్‌కు వాకోవర్ లభించింది. బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై నాదల్ అద్భుత విజయం సాధించాడు. నాలుగున్నర గంటల పాటు సాగిన పోరులో నాదల్ పొత్తికడపులో గాయపడ్డాడు. అయినా గాయానికి వెరువకుండా అసమాన పోరాట పటిమతో నాదల్ సెమీస్ పోరులో నిలిచాడు.