బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 25, 2020 , 00:22:21

రూర్కెలాలో అతిపెద్ద హాకీ స్టేడియం

రూర్కెలాలో అతిపెద్ద హాకీ స్టేడియం

భువనేశ్వర్‌: దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని.. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్‌ వరకు దాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఒడిశా ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. సుందర్‌ఘర్‌ జిల్లాలోని రూర్కెలాలో ఈ మైదానం నిర్మాణం సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. బిజూ పట్నాయక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ ఆవరణలోని 15 ఎకరాల్లో, 20 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు వీలుగా పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. ‘2023 హాకీ ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వడాన్ని గర్వంగా భావిస్తున్నాం.. భువనేశ్వర్‌, రూర్కెలలో మెగాటోర్నీని నిర్వహించాలనుకుంటున్నాం’ అని నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు.


logo