Virat kohli | ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. ద్వైపాక్షి క సిరీస్‌లలో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న కోహ్లీ ఐసీసీ వంటి మెగా టోర్నీలలో మాత్రం ఆస్థాయిలో శతకాలు సాధించలేకపోయాడు. 2011 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఆడుతున్న కోహ్లీ (ప్రస్తుతం నాలుగోవది) కి ఇది మూడో శతకం కావడం గమనార్హం. కోహ్లీ తన తొలి సెంచరీని బంగ్లాదేశ్పైనే చేయగా తాజాగా మూడో సెంచరీనీ అదే జట్టు మీద సాధించాడు.
2011 వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ తొలి శతకం బాదాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఢాకా వేదికగా ఇదే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ వంద పరుగులు సాధించాడు. వన్డే ప్రపంచకప్ లలో కోహ్లీకి ఇదే తొలి శతకం. ఆ తర్వాత 2015లో పాకిస్తాన్ పై సెంచరీ చేశాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ.. పటిష్ట బౌలింగ్ దళమున్న పాక్‌పై 126 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఆతర్వాత జరిగిన 2019 ప్రపంచకప్‌లో కోహ్లీ సెంచరీకి చేరువగా వచ్చాడే గానీ మూడంకెల స్కోరు చేరుకోలేదు.
Kohli was 74 when India needed 26 runs then:
6, 1, 4, 0, 0, 6, 0, 1, 0, wd, 2, 0, 2, 0, 1, 0, 0, 6.
Kohli faced all balls – A huge hug for Rahul. pic.twitter.com/gGqaGmt7Ke
— Johns. (@CricCrazyJohns) October 19, 2023
ఇక తాజాగా భారత్ వేదికగానే జరుగుతున్న ప్రపంచకప్‌లో కూడా విరాట్.. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 85 పరుగులు సాధించి శతకానికి దగ్గరగా వచ్చాడు. అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో 55 రన్స్ చేసిన రన్ మిషీన్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 16 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ బంగ్లాదేశ్ తో మ్యాచ్‌లో ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకుని ఈ మెగా టోర్నీలలో తన మూడో శతకాన్ని పూర్తి చేశాడు. కోహ్లీకి ఓవరాల్‌గా ఇది వన్డేలలో 48వ సెంచరీ. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత విజయలక్ష్యానికి 26 పరుగులు అవసరం ఉన్నప్పుడు కోహ్లీ వ్యక్తిగత స్కోరు కూడా 74 పరుగుల వద్ద ఉంది. సెంచరీకి కోహ్లీకి 26 పరుగులే కావాలి.
ఈ తరుణంలో కెఎల్ రాహుల్.. ఒక్క పరుగు కూడా తీయకుండా కోహ్లీకి సహకరించాడు. రాహుల్ చేసిన త్యాగాన్ని కోహ్లీ వృథా పోనీయలేదు. 26 రన్స్‌లో మూడు సిక్సర్లు, ఒక బౌండరీ, రెండు డబుల్స్, మూడు సింగిల్స్ ఉన్నాయి. కోహ్లీ మ్యాచ్‌ను ముగించాక రోహిత్ శర్మ వచ్చి.. సెంచరీ చేసినందుకు విరాట్‌తో పాటు కెఎల్ రాహుల్ ను కూడా మనసారా అభినందించాడు.