Lockie Ferguson | ట్రినిడాడ్: టీ20లలో బౌలర్లు కలలో కూడా ఊహించని విధంగా న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ (3/0) రికార్డు స్పెల్ తో పొట్టి ప్రపంచకప్లో న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్లో ఘనవిజయం సాధించింది. పపువా న్యూ గినీ (పీఎన్జీ)తో జరిగిన పోరులో ఫెర్గూసన్.. 4 ఓవర్లు వేయగా నాలుగూ మెయిడిన్లే కాగా 3 కీలక వికెట్లు తీయడం విశేషం. ఫెర్గూసన్, బౌల్ట్ (2/14), సౌధీ (2/11) ధాటికి పీఎన్జీ 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనను కివీస్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. డెవాన్ కాన్వే (35) రాణించాడు. ఫెర్గూసన్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.