మౌంట్ మౌంగనుయి : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 575/8 రన్స్ చేసింది. డెవాన్ కాన్వే (227) ద్విశతకానికి తోడు కెప్టెన్ లాథమ్ (137), రచిన్ (72) రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ కూడా దీటుగానే బదులిస్తున్నది. రెండో రోజు ఆట చివరికి ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 110 పరుగులు చేసింది.