Shakib Al Hasan | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ హసన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. షకీబ్ బౌలింగ్ యాక్షన్ విషయంలో క్లీన్చిట్ లభించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వన్డే మ్యాచ్‌లు, లీగ్‌ల మ్యాచులు ఆడే అవకాశం దక్కింది. బంగ్లా ఆటగాడు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ తాను మళ్లీ బౌలింగ్ చేయగలనని పేర్కొన్నాడు. అయితే, రెండుసార్లు బౌలింగ్ యాక్షన్ రివ్యూలో పాల్గొననగా.. నిబంధనలకు విరుద్ధంగా గుర్తించారు. మూడోసారి రివ్యూకు వెళ్లగా యాక్షన్‌లో ఎలాంటి లోపం లేదని గుర్తించారు. అయితే, బౌలింగ్ యాక్షన్‌పై మూడోసారి ఎక్కడ రివ్యూకు వెళ్లాడో షకీబ్ వెల్లడించలేదు. చివరిసారిగా గతేడాది కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఆడాడు. 37 ఏళ్ల ఆల్‌రౌండర్ గతేడాది సెప్టెంబర్‌లో కౌంటీ చాంపియన్‌షిప్‌లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడాడు. ఈ సమయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించారు.
అదే నెలలో లౌబరో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరీక్షల్లో షకీబ్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించారు. జనవరిలో మళ్లీ చెన్నైలో పరీక్ష జరగ్గా.. విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించలేదు. ఐసీసీ విధించిన బ్యాన్ కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ఆడే అవకాశం ఉన్నది. ఐపీఎల్, పీఎస్ఎల్లో ఆడడం లేదు. గత సీజన్ వరకు ఐపీఎల్లో ఆడిన బంగ్లా మాజీ కెప్టెన్ వేలంలో కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. షకీబ్‌పై నిషేధం ఉన్నా.. బ్యాట్స్‌మెన్‌గా మాత్రం ఆడేందుకు అవకాశం ఉంది. షకీబ్ ప్రస్తుతం గతేడాది టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్ గందరగోళంలో పడింది. షకీబ్ 71 టెస్టుల్లో 4609 పరుగులు చేసి.. 246 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేలు ఆడి.. 7,570 పరుగులు చేసి.. 317 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు తీశాడు.