Paris Masters 2023 | ఏడోసారి ప్యారిస్ మాస్టర్స్ ట్రోఫీ చాంపియన్‌గా జకోవిచ్
Paris Masters 2023 : పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్()కు ఎదురన్నదే లేకుండా పోయింది. నెలక్రితమే యూఎస్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ టైటిల్ ముద్దాడిన జకో.. ఆదివారం ప్యారిస్ మాస్టర్స్ ట్రోఫీ(Paris Masters 2023)...
Paris Masters 2023 : పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్()కు ఎదురన్నదే లేకుండా పోయింది. నెలక్రితమే యూఎస్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ టైటిల్ ముద్దాడిన జకో.. ఆదివారం ప్యారిస్ మాస్టర్స్ ట్రోఫీ(Paris Masters 2023) చాంపియన్‌గా అవతరించాడు. అతడికి ఇది ఏడో టైటిల్ కావడం విశేషం. అంతేకాదు 40 సార్లు మాస్టర్స్ ఏటీపీ 1000 టైటిల్ సాధించిన తొలి ప్లేయర్‌గా జకో రికార్డు నెలకొల్పాడు.
సెమీఫైనల్లో రష్యాకు చెందిన ఆండ్రే రుబ్లెవ్(Paris Masters title)పై అతికష్టంగా గెలిచిన జకోవిచ్.. ఫైనల్లో మాత్రం టైటిల్ పోరులో గ్రెగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడి 6-4, 6-3తో టైటిల్ కొల్లగొట్టాడు. ‘ఈ వారంలో కష్టమైన సవాళ్లను అధిగమించి టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది’ అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ అన్నాడు.
గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డు
ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న జకోవిచ్‌కు వరుసగా టైటిళ్లతో దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌తో మొదలైన అతడి టైటిళ్ల వేట దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సెర్బియా ప్లేయర్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో రఫెల్ నాదల్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
-
Chinna Movie | ఓటీటీలోకి రాబోతున్న సిద్ధార్థ్ ‘చిన్నా’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే.?
-
Virat Kohli | షారుఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేసిన కోహ్లీ.. వీడియో వైరల్
-
Paris Masters 2023 | ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి.. చేజారిన నంబర్ 1 ర్యాంక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

